Tulasi Reddy: ఏపీలో ప్రభుత్వ శాఖలకు సలహాదారులపై నియామకంపై ఇటీవల హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాజాగా కాంగ్రెస్ నేత తులసిరెడ్డి కూడా ఏపీ ప్రభుత్వ సలహాదారులపై తీవ్ర విమర్శలు చేశారు. వీరు సలహాదారులు కాదని.. స్వాహాదారులు అని ఆరోపించారు. ప్రభుత్వ అధికారుల కంటే వీరు మంచి సలహాలు ఇస్తారా అని తులసిరెడ్డి ప్రశ్నించారు. వైసీపీ నాయకులకు సలహదారుల వ్యవస్థ ఉపాధి హామీ పథకం వంటిదని చురకలు అంటించారు. సలహాదారుల పేరుతో జగన్ తన…
Andhra Pradesh: ఏపీలో సలహాదారుల నియామకాన్ని హైకోర్టు తీవ్రంగా తప్పుబట్టింది. ఇలాగే వదిలేస్తే భవిష్యత్‌లో కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, తహసీల్దార్లకు కూడా సలహాదారులను నియమిస్తారా అంటూ ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. సలహాదారుల నియామకానికి అంతు ఎక్కడ ఉందని మండిపడింది. ముఖ్యమంత్రి, మంత్రులకు సలహాదారులను నియమిస్తే అర్ధం చేసుకోగలం కానీ.. ప్రభుత్వ శాఖలకు సలహాదారులను నియమించడం ఏంటని హైకోర్టు నిలదీసింది. సలహాదారుల నియామకం రాజ్యాంగ బద్దమో కాదో తేలుస్తామని స్పష్టం చేసింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ అధికారాలను…
ఏపీ ప్రభుత్వంలో నలుగురు సలహాదారుల పదవీకాలాన్ని మరో ఏడాది పాటు పొడిగిస్తూ జగన్ సర్కారు సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రజా వ్యవహారాల ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి, సీఎం జగన్ ముఖ్య సలహాదారు అజేయ కల్లం, సీఎం సలహాదారుడు ఎం.శామ్యూల్ (రిటైర్డ్ ఐఏఎస్), జీవీడీ కృష్ణమోహన్ (కమ్యూనికేషన్స్) పదవీ కాలాన్ని పొడిగిస్తున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీర్ శర్మ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వీళ్లంతా మరో ఏడాది పాటు సలహాదారులుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. కాగా 2019లో జగన్…