PM Modi: ఇస్రో ప్రతిష్టాత్మకం చేపట్టిన ‘ఆదిత్య ఎల్ 1 సోలార్ మిషన్’ విజయవంతం అయింది. ఈ రోజు 11.50 గంటలకు పీఎస్ఎల్వీ రాకెట్ ద్వారా నింగిలోకి పంపబడింది. భూమి దిగువ కక్ష్యలో ఎల్ 1 శాటిలైట్ ను ప్రవేశపెట్టింది. ఇక్కడ నుంచి నాలుగు నెలలు ప్రయాణించి భూమి, సూర్యుడికి మధ్య ఉండే లాంగ్రేజ్ పాయింట్1(L1)కి చేరనుంది.
Aditya-L1: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) చంద్రయాన్-3 విజయం తర్వాత మరో ప్రతిష్టాత్మక ప్రయోగానికి సిద్ధం అవుతోంది. సూర్యుడిపై అధ్యయనానికి ‘ఆదిత్య ఎల్1’ మిషన్‌ని నిర్వహించనుంది.