Adireddy Vasu: మెడికల్ కాలేజీల వివాదంపై టీడీపీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు ఘాటుగా విమర్శలు చేశారు. మాజీ సీఎం జగన్ అన్నట్లుగా రాజమండ్రి మెడికల్ కాలేజీ చూసి ఆహా అనలేమని.. రాజమండ్రిలో ఓహో అనిపించేలా వైసీపీ పార్టీ కార్యాలయం మాత్రం కట్టుకున్నారని ఆరోపించారు. గత జగన్ ప్రభుత్వం మెడికల్ కాలేజ్ నిర్మిస్తామని రూ. 5 వేల కోట్లు అప్పు చేసిందని, ఆ నిధులు ఎటు దారి మళ్లించాలో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు…
టీడీపీ సీనియర్ నేత, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కుటుంబం మధ్య మరోసారి రచ్చ రాజుకుంది. రాజమండ్రి సిటీ సీటు విషయంలో రెండు వర్గాల మధ్యవిభేదాలు ఎప్పటి నుంచో వివాదాలున్నాయి. 2014-19 మధ్య పీక్స్‌కు చేరిన గొడవలు వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ళతో పాటు గడిచిన ఏడాదిగా కాస్త తగ్గాయి. కిందిస్థాయిలోని నాయకుల మధ్య అడపాదడపా గొడవలు జరుగుతున్నా... అవి పెద్ద నేతలిద్దరూ జోక్యం చేసుకునేదాకా వెళ్ళలేదు.
Butchaiah Chowdary: రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుపై రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటు తన ఘనత అని సిటీ ఎమ్మెల్యే వాసు ప్రకటించుకోవడాన్ని గోరంట్ల తప్పుపట్టారు. 1985లోనే ఎన్టీఆర్ స్వయంగా ఈ విశ్వవిద్యాలయం స్థాపనకు ప్రణాళికలు రచించారని, ఆ సమయంలో భూముల కేటాయింపులో తానూ కీలక పాత్ర పోషించిన విషయాన్ని గుర్తు చేశారు. తెలుగు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు తాను వేసిన కృషిని గుర్తు చేస్తూ, రాష్ట్ర…