(డిసెంబర్ 14న ఆది పినిశెట్టి బర్త్ డే)ఆరడుగులకు పైగా ఎత్తు, చక్కని శరీరసౌష్టవం- అటు ప్రతినాయకునిగానైనా అలరించగల నేర్పు, ఇటు కథానాయకునిగానూ మెప్పించగల ఓర్పు రెండూ ఉన్నాయి ఆది పినిశెట్టిలో. చూడగానే ఇట్టే ఆకట్టుకొనే రూపంతో ఆది పినిశెట్టి తనకు లభించిన పాత్రలకు న్యాయం చేసుకుంటూ సాగుతున్నారు. ఆది తండ్రి రవిరాజా పినిశెట్టి దర్శకునిగా తనదైన బాణీ పలికించారు. ఆది మాత్రం నటునిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఇప్పటికే పలు చిత్రాలలో విలక్షణమైన పాత్రల్లో సలక్షణంగా…