India Job Growth: ఓవైపు ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది.. ఇంటర్నేషనల్ సంస్థల నుంచి చిన్న కంపెనీల వరకు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించినట్టు ప్రకటనలు వచ్చాయి.. అయితే, భారత్‌లో మాత్రం ఉద్యోగాల జాతరే కొనసాగింది.. ఈ సంవత్సరం భారతదేశంలో పండుగ సీజన్ ఉద్యోగ మార్కెట్‌ను పునరుజ్జీవింపజేసింది. ఆగస్టు మరియు అక్టోబర్ మధ్య, ముఖ్యంగా వినియోగ సంబంధిత రంగాలలో ఉద్యోగ అవకాశాలు 17 శాతం పెరిగాయి. బలమైన వినియోగదారుల సెంటిమెంట్, ఆకర్షణీయమైన ఆఫర్లు మరియు దేశవ్యాప్తంగా మార్కెట్ పరిధి…