ఎస్వీ వేదిక్ యూనివర్శిటి వైస్ ఛాన్సలర్ సుదర్శన శర్మ పై వేటు వేసింది ప్రభుత్వం. నిబంధనలకు విరుద్దంగా ఇప్పటికే మూడు పర్యాయాలు వైస్ ఛాన్సలర్ గా కొనసాగారు సుదర్శన శర్మ. ఎట్టకేలకు ఆయనపై వేటు వేసింది. గత ఏడాది నవంబర్ లోనే వీసీ సుదర్శన శర్మ పదవీకాలం ముగిసింది. ఇన్ ఛార్జి వైస్ ఛాన్సలర్ నిబంధనలకు వ్యతిరేకంగా పదవిలో కొనసాగారు సుదర్శనశర్మ. నూతన వైస్ ఛాన్సలర్ నియామకం జరగకుండా సేర్చ్ కమిటీకి సుదర్శనశర్మ అడ్డంకులు సృష్టిస్తున్నట్లు ఆరోపణలు…
అన్నమయ్యని అగౌరపరుస్తున్నారని టీటీడీ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు టీటీడీ అదనపు ఇఓ ధర్మారెడ్డి. శ్రీవారి ఆలయంలో సుప్రభాత సేవ,కళ్యాణోత్సవం,ఏకాంత సేవ కార్యక్రమంలో అన్నమయ్య వంశీకులు పాల్గొంటారు. మాస్టర్ ప్లాన్ అమలులో భాగంగా నాలుగు మాడ వీధులలో మఠాలుతో పాటు స్థానికుల నివాసాలను తొలగించాం….వారికి ప్రత్యామ్నాయ ప్రదేశాలలో పునరావాసం కల్పించాం అన్నారు ధర్మారెడ్డి. అన్నమయ్య వంశీకులుకు శ్రీవారి ఆలయంలో సంప్రదాయబద్దంగా వస్తూన్న గౌరవ మర్యాదలు కల్పిస్తున్నాం అన్నారు. 45 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన అన్నమయ్య ప్రాజేక్ట్…