Gautam Adani : పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ ఖాతాలోకి త్వరలో రూ.21,580 కోట్లు రావచ్చు. ఇందుకోసం పెద్ద ఎత్తున చర్చలు కూడా జరుగుతున్నాయి. గౌతమ్ అదానీకి చెందిన అదానీ గ్రూప్ పశ్చిమాసియా దేశాలలోని అనేక సావరిన్ ఫండ్ సంస్థల నుండి 2.6 బిలియన్ డాలర్లను సేకరించేందుకు ప్రయత్నిస్తోంది.