ఒకప్పుడు ఎకరాల్లో కొనేవారు.. ఇప్పుడు గజాల్లో కొనుగోలు చేసేందుకే ఇబ్బంది పడుతున్నారు.. ఎస్‌ఎఫ్‌టీల్లో కొని సంబరపడాల్సిన పరిణామాలు వచ్చాయి.. అయితే, తెలుగు, తమిళ సినిమాల్లో తన కంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న సీనియర్ నటి వాణిశ్రీ భూమి కబ్జాకు గురైంది.. దాదాపు 11 ఏళ్ల క్రితం వాణిశ్రీ భూమిని కొందరు నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.. ఆ భూమి విలువ ప్రస్తుత మార్కెట్‌లో రూ.20 కోట్లకు పై మాటేనటి.. అయితే, నకిలీ పత్రాలతో జరిగిన రిజిస్ట్రేషన్‌ను…
నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు, కళాభినేత్రి వాణిశ్రీ జంటగా నటించిన అనేక చిత్రాలు తెలుగువారిని పులకింప చేశాయి. ఏయన్నార్ హిట్ పెయిర్ గా వాణిశ్రీ జేజేలు అందుకున్నారు. వారిద్దరూ జోడీగా నటించిన ‘ఆలుమగలు’ చిత్రం కూడా తెలుగువారిని విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమా 1977 మార్చి 17న విడుదలయి, విజయఢంకా మోగించింది. అక్కినేనితో పలు విజయవంతమైన చిత్రాలు నిర్మించిన ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ అధినేత ఎ.వి.సుబ్బారావు ‘ఆలుమగలు’ సినిమాను తాతినేని రామారావు దర్శకత్వంలో తెరకెక్కించారు. ‘ఆలుమగలు’ కథ ఏమిటంటే-…
(ఆగస్టు 3న కళాభినేత్రి వాణిశ్రీ పుట్టినరోజు) అనితరసాధ్యం, అద్భుతం, అపూర్వం, అనూహ్యం అంటూ పలు ఉపమానాలు వల్లిస్తూ కొందరిని కీర్తించడం కద్దు. అలాంటి అన్ని ఉపమానాలకు సరితూగే ప్రతిభ సొంతం చేసుకున్న నటి వాణిశ్రీ. ఇది కొందరికి అతిశయోక్తి అనిపించవచ్చు. కానీ, ఆమె కెరీర్ గ్రాఫ్ ను చూస్తే మరికొన్ని ఉపమానాలను సైతం జోడించాలనిపిస్తుంది. అదీ వాణిశ్రీ అభినయంలోని ప్రత్యేకత! కొన్ని క్షణాల పాటు వెండితెరపై తళుక్కున మెరిసే పాత్రలో తొలిసారి కనిపించిన వాణిశ్రీ, ఆ తరువాత…