జ్యోతిలక్ష్మిలాగా గొప్ప నర్తకి కాదు, జయమాలినిలాగా అందం, చందం ఉన్నదీ లేదు. అయినా సిల్క్ స్మిత ప్రవేశంతో ఆ ఇద్దరికీ కొన్ని అవకాశాలు తగ్గాయి అనడం అతిశయోక్తి కాదు. మరి సిల్క్ స్మితలో ఏముంది? మత్తెక్కించే కళ్ళతో మైమరిపించే ఆకర్షణ ఉంది. అందుకే సిల్క్ ను కొందరు అయస్కాంతం అన్నారు.
(డిసెంబర్ 2న సిల్క్ స్మిత జయంతి)‘సిల్క్’… ఈ పేరు వినగానే ఆ రోజుల్లో కుర్రాళ్ళ నరాలు జివ్వుమనేవి. ఇక సిల్క్ స్మితను తెరపై చూడగానే వారి మనసులు విహంగాలై తేలిపోయేవి. సిల్క్ స్మితను శృంగార రసాధిదేవతగా కొలిచిన వారెందరో ఉన్నారు. సిల్క్ స్మిత నర్తనంలో పట్టు కనిపించక పోయినా, ఆమె సౌష్టవం గుట్టుగా జనం మద�