ర్యాగింగ్ భూతానికి 15 ఏళ్ల బాలుడు బలయ్యాడు. కేరళలోని టీనేజర్ మిహిర్ ఆత్మహత్య సంచలనంగా మారింది. స్కూల్‌లో ర్యాగింగ్, బెదిరింపులతో ప్రాణం తీసుకున్నాడు. కేరళలోని ఎర్నాకుళంలోని త్రిప్పునితురలో జనవరి 15న మిహిర్ తన అపార్ట్‌మెంట్ భవనంలోని 26వ అంతస్తు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తన కుమారుడు ఎదుర్కొన్న భయంకరమైన అనుభవాలను అతడి తల్లి రజ్నా పీఎం సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. తాజాగా ఈ అంశంపై నటి సమంత ఇన్‌స్టాగ్రామ్ వేదికగా స్పందించింది. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని…
సీనియర్ భామలకు టాలీవుడ్‌ను పక్కన పెట్టేస్తున్నారా అంటేఅవుననే సమాధానం వినిపిస్తోంది. సమంత, నిత్యామీనన్, చందమామ కాజల్, రకుల్, నయనతార, తమన్నా వీరంతా ఒకప్పడు టాలీవుడ్ లో ఓ వెలుగు వెలిగిన నటీమణులు.కానీ ఇప్పుడు టాలీవుడ్ ను పూర్తిగా మరిచారు. గ్లామర్ రోల్స్ పోషించేశాం.. ఇక కంటెంట్ బేస్డ్ కథలకే మా ఓట్ అంటున్నారు సీనియర్ భామలు. అందుకే ఒకటికి రెండు సార్లు ఆలోచించి గాని సినిమాలు ఒకే చేయట్లేదు. దీంతో మూవీ మూవీకి మధ్య భారీ గ్యాప్…
సమంత రూత్ ప్రభు తన కొత్త ప్రాజెక్ట్ 'సిటాడెల్: హనీ బన్నీ' ప్రమోషన్‌లో బిజీగా ఉంది. అయితే.. ఈ నటికి చెందిన ఇటీవల తన పాత ప్రకటన వీడియో మళ్లీ తెరపైకి వచ్చింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 2010లో తన నటనా జీవితాన్ని ప్రారంభించిన సమంత కేవలం సినిమాలు, షోలలో మాత్రమే కాకుండా అనేక ప్రకటనలు కూడా చేసింది.
మంత్రి కొండ సురేఖ వ్యాఖ్యలపై నటి సమంత స్పందించింది. తన విడాకులు వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని అభ్యర్థించింది. సోషల్ మీడియా వేదికగా సమాధానమిచ్చింది. "స్త్రీగా ఉండటానికి, బయటకు వచ్చి నిలబడి పోరాడటానికి.. చాలా ధైర్యం, బలం కావాలి.
Nani’s Yeto vellipoyindi manasu Re-release: నాచురల్ స్టార్ నాని చివరిసారిగా హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులని అలరించారు. తదుపరి చిత్రం సరిపోదా శనివారంలో కనిపించనున్నారు. ఆగష్టు 29న రిలీజ్ కాబోతున్నఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే నాని ఫాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ బయటకి వచ్చింది. అది ఏమిటి అంటే డైరెక్టర్ గౌతం మీనన్ దర్శకత్వంలో 2012 డిసెంబరు 14 న విడుదలైన ప్రేమకథా చిత్రం “ఎటో వెళ్ళిపోయింది మనసు” రీరిలీజ్…
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ హిట్ ‘అల…వైకుంఠపురములో’ అయితే, సక్సెస్ తో పాటు బెస్ట్ పెర్ ఫార్మర్ గా బన్నీకి పేరు తెచ్చిన చిత్రం ‘పుష్ప : ద రైజ్’ అనే చెప్పాలి. ఈ సినిమాకు సీక్వెల్ గా ‘పుష్ప: ద రూల్’ రాబోతోంది. తొలి భాగంలో పోలీస్ ఇన్ స్పెక్టర్ గా నటించిన ఫహద్ ఫాజిల్ కు పుష్ప పాత్రధారి అల్లు అర్జున్ బట్టలు ఊడతీయించి పంపుతాడు. ఆ తరువాత ఏమవుతుంది? అదే…
దర్శక ధీరుడు రాజమౌళి ‘ట్రిపుల్ ఆర్’లోని పాట కోసం ఎన్టీయార్, రామ్ చరణ్ అభిమానులే కాదు… గ్రేట్ ఫిల్మ్ మేకర్ రాజమౌళి సినీ అభిమానులు సైతం కళ్లు కాయలు కాసేలా ఎదురు చూశారన్నది వాస్తవం. బహుశా అందుకే కాబోలు ముందు చెప్పిన దానికంటే ఓ గంట ముందే ‘నాటు పాట’ను ‘ట్రిపుల్ ఆర్’ మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటను చూసి చూడగానే సమంత ఠక్కున దీన్ని షేర్ చేస్తూ ‘మెంటల్’ అంటూ కామెంట్ చేసింది. అందుకు…