Re-release Trend: నాని సమంతల రొమాంటిక్ మూవీ.. రీ రిలీజ్ ఎప్పుడు అంటే..?
- నాని ఫాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్
- నాని సమంతల ఉరూతలూగించిన రొమాంటిక్ మూవీ
- రీ రిలీజ్ ఎప్పుడు అంటే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nani’s Yeto vellipoyindi manasu Re-release: నాచురల్ స్టార్ నాని చివరిసారిగా హాయ్ నాన్న సినిమాతో ప్రేక్షకులని అలరించారు. తదుపరి చిత్రం సరిపోదా శనివారంలో కనిపించనున్నారు. ఆగష్టు 29న రిలీజ్ కాబోతున్నఈ సినిమా కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇంతలోనే నాని ఫాన్స్ కి కిక్ ఇచ్చే న్యూస్ బయటకి వచ్చింది. అది ఏమిటి అంటే డైరెక్టర్ గౌతం మీనన్ దర్శకత్వంలో 2012 డిసెంబరు 14 న విడుదలైన ప్రేమకథా చిత్రం “ఎటో వెళ్ళిపోయింది మనసు” రీరిలీజ్ కాబోతుంది. నాని హీరోగా,, సమంత హీరోయిన్ గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి సంగీత దర్శకత్వం ఇళయరాజా అందించారు. తమిళంలో “నీదానే ఎన్ పొన్వసంతం’ గా ఈ చిత్రం ద్విభాషా చిత్రంగా రూపొందింది. అందులో తమిళ నటుడు జీవా నాని నటించిన వరుణ్ పాత్రను పొషించగా, నిత్య పాత్రను సమంత పొషించింది. ఇక లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పర్వాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది.

Nani’s Yeto Vellipoyindhi Manasu To Re-release On This Date
Also Read
- Immortal Success Surprise : ఇమ్మోర్టల్ సక్సెస్ సెలబ్రేషన్స్.. హీరోకు నిర్మాత వెరైటీ గిఫ్ట్! ట్రెండ్ మార్చేశాడుగా..
- Suriya: సింగం ఫ్యాన్స్‌కి గుడ్‌న్యూస్.. సూర్య కొత్త మూవీ టైటిల్, రిలీజ్ డేట్ వచ్చేశాయ్ చూశారా!
- Irumudi Jackpot: ఇరుముడితో రవితేజకు జాక్‌పాట్.. రెమ్యునరేషన్ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ లాభం! అసలు లెక్కలు ఇవే..
- Toxic తొలిరోజే నెగెటివ్ రివ్యూస్.. యశ్ ఏమన్నాడో తెలిస్తే షాక్ అవుతారు!
Also Read: Nani New Look: మళ్ళీ మిడిల్ క్లాస్ అబ్బాయిగా అలరించనున్న నాని
ఈ మూవీ లోని నాని , సమంత నటనలకు ప్రేక్షకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. అలాగే వీరిద్దరి మధ్య ఈ సినిమాలో కెమిస్ట్రీ కి కూడా విమర్శకుల నుండి మంచి ప్రశంసలు దక్కాయి. ఇలా ఆ సమయంలో మంచి విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయనున్నారు. అందుకు సంబంధించి ఈ సినిమాను ఆగస్టు 2 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేశారు. ఇకపోతే ఈ మధ్య కాలంలో తెలుగు నుండి అనేక సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. అందులో కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి. మరి ఎటో వెళ్లిపోయింది మనసు లాంటి లవ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే ఆగస్టు 2 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.
తాజావార్తలు
-
Apple iPhone Duo: Apple తొలి ఫోల్డబుల్ ఫోన్ iPhone Duo వచ్చేసింది.. A20 Pro చిప్, 2TB స్టోరేజ్, 48MP కెమెరా
-
OTR : గీత దాటిన గులాబీ ఎమ్మెల్సీలపై వేటేనా?
-
TSLPRB: తెలంగాణ కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్‌న్యూస్.. వయోపరిమితి మరో 3 ఏళ్లు పెంపు..
-
TGTET: ముగిసిన తెలంగాణ టెట్ పరీక్ష.. 89.96 శాతం మంది హాజరు..
-
Bombay High Court: జైల్లో 21 కిలోల బరువు తగ్గిన ఖైదీ.. బెయిల్ మంజూరు
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!