చైనాలో పుట్టిన కరోనా వైరస్ అన్ని దేశాలను అతలాకుతలం చేస్తున్నది. ముఖ్యంగా పేద ప్రజల జీవనోపాధిని కోల్పోయేలా చేసింది ఈ మహమ్మారి. ఈ వైరస్ కారణంగా చాలా మంది పేద ప్రజలు తమ ఉపాధిని కోల్పోయి రోడ్డున పడ్డారు. అంతేకాదు చాలా మంది ఆకలి చావులకు గురవుతున్నారు. అటు ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా సినీ పరిశ్రమపై కూడా పడింది. షూటింగ్స్ లేకపోవడంతో సినీ కార్మికులు కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా బెంగాలీ…
తండ్రి అడుగుజాడల్లో తనయులు పయనించడం చిత్రసీమలో పరిపాటి అయిపోయింది. ముఖ్యంగా నటుల వారసులు నటనవైపే మొగ్గు చూపుతున్నారు. ఆ మాటకొస్తే నిర్మాతలు, దర్శకులు, సాంకేతికనిపుణుల వారసులు కూడా నటనపైనే మోజు పెంచుకుంటున్నారు. ఇక నటవిరాట్ గా జనం మదిలో నిలచిన రావు గోపాలరావు తనయుడు రావు రమేశ్ సైతం నాన్న బాటలో పయనించి, జేజేలు అందుకుంటున్నాడు. వాచకాభినయంలో భళా అనిపించిన రావు గోపాలరావు తనయునిగా రావు రమేశ్ కూడా తనదైన డైలాగ్ యాక్సెంట్ తో జనాన్ని ఇట్టే…
నటుడు విజయ్ చందర్ పేరు వినగానే చప్పున ఈ నాటికీ ‘కరుణామయుడు’ విజయ్ చందర్ అంటూ జనం గుర్తు చేసుకుంటారు. ఏసుప్రభువు జీవితగాథ ఆధారంగా తెరకెక్కిన ‘కరుణామయుడు’ చిత్రాన్ని నిర్మించి, ఏసు పాత్రలో నటించి, అరుదైన విజయాన్ని సొంతం చేసుకున్నారు విజయ్ చందర్. అప్పటి నుంచీ జనం మదిలో ఆయన ‘కరుణామయుడు’ విజయ్ చందర్ గానే నిలచిపోయారు. తెలుగునాట యన్టీఆర్ తరువాత పురాణ,చారిత్రక పాత్రల్లో మేటి అనిపించుకున్న ఘనుడు విజయ్ చందర్. తెలుగుతెరపై ఏసుక్రీస్తు జీవితాన్ని తొలిసారి…
ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వరాఘవన్ సైతం నటుడిగా మారిపోయాడు. దాదాపు రెండున్నర దశాబ్దాలుగా తమిళంలో పలు విజయవంతమైన చిత్రాలను రూపొందించాడు సెల్వరాఘవన్. తెలుగులోనూ వెంకటేశ్ హీరోగా ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి హిట్ చిత్రాన్ని తెరకెక్కించాడు. సెల్వ రాఘవన్ తమ్ముడు ధనుష్ ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. నిజానికి సెల్వ రాఘవన్ తాను నటుడిగా మారుతున్నట్టు గత యేడాది డిసెంబర్ లోనే ప్రకటించాడు. ‘రాకీ’ ఫేమ్ అరుణ్ మాథేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్న…