ఆరేళ్ళ క్రితం రానా - తేజ కాంబినేషన్ లో వచ్చిన 'నేనే రాజు - నేనే మంత్రి' చిత్రం చక్కని విజయాన్ని అందుకుంది. ఇప్పుడు వారిద్దరి కాంబినేషన్ లోనే సీనియర్ నిర్మాత ఆచంట గోపీనాథ్ ఓ సినిమాను నిర్మించబోతున్నారు.
కొత్తదనంతో కూడిన వైవిధ్యమైన కథలు, విలక్షణ పాత్రలను ఎంపిక చేసుకొనే కథానాయకుడు రానా దగ్గుబాటి. ఇప్పటికే ‘బాహుబలి, ఘాజీ, అరణ్య’ వంటి పాన్ ఇండియా మూవీస్ చేసిన రానా మరో పాన్ ఇండియా మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. విశ్వశాంతి పిక్చర్స్ అధినేత ఆచంట గోపీనాథ్ ఈ సినిమాను సిహెచ్ రాంబాబుతో కలిసి నిర్మించబోతున్నారు. ప్రస్తుతం సెట్స్ పై ఉన్న పవన్ కళ్యాణ్, రానా మూవీ షూటింగ్ పూర్తి కాగానే, రానాతో ఈ సినిమాను ప్రారంభిస్తామని నిర్మాతలు…