దేశవ్యాప్తంగా సంచలనం రేపిన.. లఖింపూర్ ఘటనలో కీలక నిందితుడిగా ఉన్న కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు… ఆశిష్ మిశ్రా ఆచూకీ ఇంకా తెలియలేదు. అతను ఎక్కడున్నాడనే దానిపై స్పష్టత కొరవడింది. క్రైమ్ బ్రాంచ్ కార్యాలయానికి హాజరు కావాలంటూ జారీ చేసిన నోటీసులకూ ఆశిష్ స్పందించలేదు. ఇవాళ ఉదయం పదింటికి.. క్రైం బ్రాంచ్‌లో విచారణకు హాజరుకావాల్సి ఉన్నప్పటికీ.. అతను రాకపోవడంతో ఎక్కడున్నాడనే ఉత్కంఠ నెలకొంది. ఆశిష్ మిత్రా ప్రస్తుతం ఎక్కడ ఉన్నాడనే విషయం.. ఎవరికీ తెలియడం లేదు. పోలీసులు…