ఆసియా కప్ 2025 ట్రోఫీ కాంట్రవర్సరీపై తెలుగు ఆటగాడు, టీమిండియా ప్లేయర్ తిలక్ వర్మ స్పందించాడు. సెప్టెంబర్ 28న పాకిస్థాన్‌తో ఫైనల్ అనంతరం తాము గంటసేపు మైదానంలోనే గడిపాము అని, గ్రౌండ్‌లో ట్రోఫీ ఎక్కడా కనిపించలేదని చెప్పాడు. ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) అధ్యక్షుడు, పీసీబీ చైర్మన్ మోసిన్ నఖ్వీ చేతిలో ట్రోఫీ లేదని చెప్పాడు. అందుకే ట్రోఫీ అందుకొన్నట్లుగా తాము క్రియేట్ చేశాం అని తిలక్ తెలిపాడు. ఫైనల్‌లో భారత్ గెలిచినా.. నఖ్వీ ఇప్పటివరకు ట్రోఫీ…