ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో గజ్వేల్ ఈఎన్‌సి హరిరామ్ ఏసీబి కస్టడి కొనసాగుతోంది. ఇప్పటికే హరిరామ్ ను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఈఎన్‌సీ హరిరామ్ ను ఐదు రోజుల పాటు కస్టడీకి అనుమతిచ్చింది కోర్టు. శుక్రవారం హరిరామ్ ను చంచల్‌గూడ జైలు నుంచి ఏసీబి కస్టడులోకి తీసుకుంది. ఏసీబీ ప్రధాన కార్యాలయంలో హరిరామ్ ఆస్తులపై ఏసీబీ ఆరా తీస్తోంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 13 కోట్ల రూపాయల ఆస్తులను గుర్తించింది ఏసీబి. బహిరంగ మార్కెట్ వీటి విలువ…
AP liquor scam: ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో సిట్ అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న రాజ్ కేసిరెడ్డి, చాణక్యలను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. సబ్ జైలు నుంచి వైద్య పరీక్షలు కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ACB: తెలంగాణ రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ దూకుడు పెంచింది. అవినీతి, అక్రమాస్తుల కేసుల నమోదుతో దూసుకెళ్తుంది. కేవలం 2025 ఏప్రిల్ నెలలో మొత్తం 21 కేసుల నమోదు అయ్యాయి.
ENC Hariram : తెలంగాణలో మరోసారి అవినీతి కలకలం రేపింది. కాలేశ్వరం ప్రాజెక్టు ఇంజినీరింగ్ చీఫ్ (ఈఎన్సీ) హరి రామ్‌పై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు అక్రమాస్తుల కేసు నమోదు చేసి, అతని ఇంటితో పాటు బంధువుల ఇళ్లలో 13 చోట్ల భారీగా సోదాలు నిర్వహించారు. గజ్వెల్ లో ప్రారంభమైన ఈ దర్యాప్తు, హరి రామ్‌కు చెందిన ఆస్తులను గుర్తించడంలో కీలకమైన భాగం కావడమే కాక, ఆస్తుల విలువ కూడా ఆహ్లాదకరంగా ఉంది. ఈ సోదాలు…
ఇరిగేషన్ శాఖ మాజీ ENC హరిరాం ఇంటిపై ఏసీబీ సోదాలు కొనసాగుతున్నాయి. హరిరామ్ ఇంటితో పాటు 14చోట్ల ఉదయం 6గంటల నుంచి సోదాలు జరుపుతున్నారు ఏసీబీ అధికారులు. గడిచిన 11 గంటలుగా ఆయా ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు. హరిరామ్ భార్య అనిత ఇంట్లో ఏసీబీ సోదాలు నిర్వహించింది. నీటిపారుదల శాఖలో అనిత డిప్యూటీ ENC గా ఉన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా వ్యవహరించారు హరిరాం. NDSA రిపోర్ట్ ఆధారంగా ACB సోదాలు చేపట్టింది. రెండు రోజుల క్రితమే…
మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు నమోదు అయింది. 2020లో పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీలక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని విజిలెన్స్ తనిఖీల పేరుతో బెదిరించారని అభియోగాలు ఉన్నాయి. స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి రూ.2.20 కోట్లు వసూలు చేశారని ఆమెపై ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలో విడదల రజనీపై కేసు నమోదు చేశారు.
ACB Calls: ఏసీబీ పేరుతో కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు ఫోన్ చేసి డబ్బులు డిమాండ్ చేస్తున్న సంఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ వ్యవహారంపై ఏసీబీ డీజీ అధికారికంగా స్పందించారు. ప్రభుత్వ ఉద్యోగులపై కేసులు నమోదు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఆయన తెలిపారు. డబ్బులు చెల్లించకుంటే కేసు పెడతామని భయపెట్టే వారి మాటలను నమ్మొద్దని ప్రభుత్వ ఉద్యోగులకు హెచ్చరిక చేశారు. ఏసీబీ పేరుతో ఎవరైనా బెదిరింపులకు పాల్పడిన వెంటనే సంబంధిత అధికారులకు…
లంచం ఇవ్వడం, తీసుకోవడం నేరం అని తెలిసినప్పటికీ లంచావతారులు మారడం లేదు. లంచ రహిత సమాజం కోసం పాటుపడాల్సిన అధికారులు అడ్డదార్లు తొక్కుతున్నారు. ఏసీబీ అధికారులు లంచగొండుల భరతం పడుతున్నప్పటికీ అడ్డుకట్టపడడం లేదు. తాజాగా ఓ డీపీవో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లాలో చోటుచేసుకుంది. పూర్తివివరాల్లోకి వెళ్తే.. పుల్లూరు గ్రామ శివారులో ఓ వెంచర్ మేనేజర్ నుంచి లంచం వసూలు చేసేందుకు రెడీ అయ్యారు డీపీవో శ్యామ్ సుందర్. వెంచర్…
హన్మకొండ డిప్యూటీ ట్రాన్స్ పోర్ట్ కమిషనర్ పుప్పాల శ్రీనివాస్ నివాసాలపై ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో సోదాలు నిర్వహించింది. శుక్రవారం ఉదయం నుంచి అర్ధ రాత్రి వరకు వరంగల్, ఆయన స్వస్థలం జగిత్యాలతోపాటు మొత్తం ఐదు ప్రాంతాల్లో ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. దాడుల సమయంలో పలు ఓపెన్ ప్లాట్లు, వ్యవసాయ భూములు గుర్తించిన అధికారులు. రూ.2.79 కోట్ల విలువైన మూడు ఇళ్లు, 13 .57 లక్షల…
Formula E race inquiry: ఫార్ములా ఈ రేసు కేసులో భాగంగా గ్రీన్కో, ఎస్ నెక్స్ట్ జెన్ కంపెనీ ప్రతినిధులు నేడు ఆంటీ కరప్షన్ బ్యూరో (ఏసీబీ) ముందు విచారణకు హాజరుకానున్నారు. సీజన్ 9 రేసుకు సంబంధించి రెండు కంపెనీలపై ఏసీబీ పలు ప్రశ్నలు సంధించనుంది. ఫార్ములా ఈ సీజన్ 9 కోసం గ్రీన్కో కంపెనీ కేవలం మొదటి విడతగా 30 కోట్లు మాత్రమే చెల్లించింది. అయితే మిగతా రెండు విడతల డబ్బులు ఫార్ములా ఈ ఆర్గనైజర్…