Andhra Pradesh: గనుల శాఖ మాజీ డైరెక్టర్, ఏపీఎండీసీ మాజీ ఎండీ వీజీ వెంకట రెడ్డిపై ఏసీబీ విచారణకు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఏసీబీ డీజీకి సర్కార్ సమాచారం అందించింది. దీనిపై విచారణ చేపట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని సూచనలు చేసింది. గనులు, ఇసుక అంశాల్లో అక్రమాలకు పాల్పడ్డారని వెంకటరెడ్డిపై అభియోగాలు ఉన్నాయ.. ఇండియన్ కోస్ట్ గార్డ్ సర్వీసెస్ నుంచి డిప్యూటేషనుపై గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్ కి వెంకటరెడ్డి వచ్చాడు.
Read Also: Lebanon-Israel War: తక్షణమే లెబనాన్‌ను విడిచి పెట్టాలని భారతీయులకు కేంద్రం హెచ్చరిక
ఇక, ఏపీఎండీసీ మాజీ ఎండీ వీజీ వెంకటరెడ్డిని సస్పెండ్ చేసి.. ఆయనపై ఏసీబీ విచారణకు ఆదేశించామని కోస్ట్ గార్డ్ సర్వీసెస్ కి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సమాచారం అందించింది. ఇప్పటికే వెంకట రెడ్డి హెడ్ క్వార్టర్స్ వదిలి వెళ్లారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంకటరెడ్డి ఆచూకీ లభించకుంటే లుకౌట్ నోటీసులు జారీ చేసే ఛాన్స్ ఉంది. ఇక, వెంకటరెడ్డిని విచారణ చేసేందుకు ఏసీపీ అధికారులు రెడీ అవుతున్నారని సమాచారం.