ACB Court: కాల్‌డేటా రికార్డులపై విచారణ సందర్భంగా విజయవాడలోని ఏసీబీ కోర్టులో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఏసీబీ కోర్టులో చంద్రబాబు, సీఐడీ లాయర్ల మధ్య వాగ్వాదం తలెత్తింది. దీంతో ఇరుపక్షాల లాయర్ల మధ్య వాదన పెరిగింది. ఈ నేపథ్యంలో అడ్వకేట్ ఆన్ రికార్డ్స్‌లో ఉన్న వారు మినహా అందరూ బయటకు వెళ్లాలని జడ్జి ఆదేశించారు. న్యాయవాదుల తీరుపై అసహనం వ్యక్తం చేసిన ఏసీబీ కోర్టు న్యాయమూర్తి.. ఈ విధంగా ఉంటే విచారణ కష్టమంటూ బెంచ్ దిగి వెళ్లిపోయారు.
Also Read: AP Government: ఏపీ వాసులకు గుడ్‌న్యూస్.. ఇకపై కులధ్రువీకరణ పత్రం శాశ్వతం
ఇవాళ ఏసీబీ కోర్టులో కాల్ డేటా రికార్డులపై విచారణ జరిగింది. సీఐడీ అధికారుల కాల్‌డేటా ఇవ్వాలంటూ టీడీపీ వర్గాలు పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. పిటిషన్ వేసి ఇప్పటికే నెల రోజులైందని చంద్రబాబు తరపు న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ జడ్జికి వివరించగా.. అసలు పిటిషనుకు అర్హతే లేదని సీఐడీ న్యాయవాది వివేకానంద తెలిపారు. ఈ క్రమంలో ఇరు పక్షాల న్యాయవాదుల మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో న్యాయవాదులపై జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్వకేట్ ఆన్ రికార్డ్సులో ఉన్న వాళ్లు తప్ప అందరూ బయటకెళ్లాల్సిందిగా ఆదేశిస్తూ.. ఈ విధంగా ఉంటే విచారించాలేనంటూ బెంచ్ దిగి వెళ్లిపోయారు.