ఏపీలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ఏసీబీ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో సీఎం జగన్ ఆదేశాల మేరకు ఏసీబీ యాప్ తయారు చేసింది. ‘ఏసీబీ 14400’ పేరుతో యాప్ రూపొందించింది. ఈ సందర్భంగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో జరుగుతున్న స్పందనపై సమీక్ష కార్యక్రమంలో ఏసీబీ యాప్‌ను సీఎం జగన్ ఆవిష్కరించారు. రాష్ట్రంలో ఎక్కడా అవినీతి ఉండకూడదని స్పష్టంగా చెప్పామని.. ఈ దిశగా అనేక కార్యక్రమాలు చేపట్టామని సీఎం జగన్ వ్యాఖ్యానించారు. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా…