Arogyashri: కార్పొరేట్ హాస్పిటల్స్‌లో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతున్నాయి. శుక్రవారం నాడు ఆరోగ్యశ్రీ సీఈవోకు లేహాస్పిటల్స్ అసోసియేషన్ ఖ రాసింది. ఆరోగ్యశ్రీ చరిత్రలోనే ఈ సంవత్సర కాలంలో అత్యధికంగా రూ. 1130 కోట్లు హాస్పిటల్స్‌కు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిందని తెలిపారు.
తెలంగాణలో యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగనున్నాయి. ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్‌లో ఆరోగ్యశ్రీ సేవలు యథావిధిగా కొనసాగనున్నాయి. ఈ క్రమంలో.. నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులతో ఆరోగ్యశ్రీ సీఈవో శివ శంకర్ లోతేటి చర్చలు జరిపారు. పేషెంట్లకు ఇబ్బంది కలిగించకుండా వైద్య సేవలు అందించాలని సీఈవో విజ్ఞప్తి చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఆరోగ్యశ్రీ సేవలు తిరిగి ప్రారంభమయ్యాయి. ఈ మేరకు ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రకటించింది. ఆరోగ్యశ్రీ సేవలు పునరుద్ధరించాలని నిర్ణయించామని.. శుక్రవారం ఏపీ సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి మా వినతిని తెలిపామని ఆరోగ్యశ్రీ నెట్‌వర్క్ ఆసుపత్రుల అసోసియేషన్ ప్రతినిధులు వెల్లడించారు.