30 years Of Aapadbandhavudu: కళాతపస్వి కె.విశ్వనాథ్, మెగాస్టార్ చిరంజీవి కాంబినేషన్ లో ముచ్చటగా మూడు చిత్రాలు వెలుగు చూశాయి. వారి కలయికలో రూపొందిన తొలి చిత్రం ‘శుభలేఖ’ 1982లో జనం ముందు నిలచింది. 1987లో రెండో చిత్రంగా ‘స్వయంకృషి’ ప్రేక్షకులను అలరించింది. 1992 అక్టోబర్ 9న మూడో సినిమాగా ‘ఆపద్బాంధవుడు’ విడుదలయింది. ఈ మూడు చిత్రాలు చిరంజీవిలోని నటుడికి ప్రేక్షకులు పట్టాభిషేకం చేసేలా చేశాయనే చెప్పాలి. ఈ మూడు చిత్రాల్లోనూ చిరంజీవి నటునిగా ఒక్కో మెట్టూ…
ప్రస్తుతం తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కరలేని పేరు సముతిరకని. తమిళనాట నటదర్శకునిగా సాగుతున్న సముతిరకని అనేక తెలుగు చిత్రాలలో తనదైన అభినయంతో ఆకట్టుకున్నారు. ఆయన తమిళంలో రూపొందించిన కొన్ని సినిమాలు తెలుగులోనూ రీమేక్ అయ్యాయి. దర్శకునిగానూ తెలుగులో కొన్నిచిత్రాలు తెరకెక్కించారు. ఇక ‘అల…వైకుంఠపురములో’, ‘ట్రిపుల్ ఆర్’ సినిమాలతో సముతిరకని నటునిగానూ తెలుగువారికి దగ్గరయ్యారు . సముతిరకని దర్శకత్వంలో రూపొందిన ‘వినోదయ సిథమ్’ చిత్రం తెలుగులో పవన్ కళ్యాణ్ హీరోగా ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కనుంది. సముతిరకని 1973 ఏప్రిల్…