న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించి బీజేపీ అభ్యర్థి పర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ సృష్టించారు. న్యూఢిల్లీ అసెంబ్లీ స్థానంలో పర్వేశ్ వర్మ 3181 ఓట్ల భారీ ఆధిక్యంతో అరవింద్ కేజ్రీవాల్‌ను ఓడించారు. కాగా.. గెలుపు అనంతరం ఆయన ఓ ట్వీట్ చేశారు. హిందీలో "జైశ్రీరామ్" అని రాసుకొచ్చారు. ప్రస్తుతంపర్వేశ్ సాహిబ్ సింగ్ వర్మ పేరు దేశ వ్యాప్తంగా సంచలనం కావడంతో ఆయన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది.
Delhi Liquor Scam: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ ఘోర పరాజయం పాలైంది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలే కౌంటింగ్‌లో కనిపించాయి. ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఎఫెక్ట్ ఈ ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది. ఆప్ కీలక నేతలంతా ఒక్కొక్కరుగా ఓటమి పాలయ్యారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సహా మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్, సోమనాథ్ భారతి వంటి కీలక నేతలు ఓడిపోయారు.
ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా స్పందించారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, ఫలితాలు దీనిని ప్రతిబింబిస్తున్నాయని ఆమె అన్నారు. గెలిచిన వారందరికీ అభినందనలు తెలిపారు. మనం అట్టడుగు స్థాయిలో పని చేయాల్సి ఉంది. ఈ ఎన్నికల నుంచి నేర్చుకుని ముందుకు సాగాలన్నారు. READ MORE:Aryan Khan: ఆర్యన్ ఖాన్ దర్శకత్వంలో ఎస్.ఎస్. రాజమౌళి..? ఇదిలా ఉండగా.. దశాబ్దాల ఘన చరిత్ర. దేశానికి స్వాతంత్ర్యం…
Parvesh Varma: ఢిల్లీలో బీజేపీ ఘన విజయం సాధించింది. ఆప్ అగ్రనేతల్ని ఓడించి మరీ ఢిల్లీని కైవసం చేసుకుంది. మొత్తం 70 స్థానాలు ఉన్న ఢిల్లీలో 48 చోట్ల బీజేపీ, 22 చోట్ల ఆప్ విజయం దాదాపు గా ఖరారైంది.
కల్కాజీ స్థానం నుంచి ఆప్ అభ్యర్థి ఆతీశీ విజయం సాధించారు. ఆమె ఈ సీటును రెండోసారి గెలుచుకున్నారు. ఆయన ఎన్నికల్లో బీజేపీకి చెందిన రమేష్ బిధురిని ఓడించారు.
Manish Sisodia: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం దిశగా వెళ్తోంది. పదేళ్ల పాటు ఢిల్లీని ఏలిన ఆప్ ఘోర పరాజయం పాలవుతోంది. ముఖ్యంగా ఆప్ ప్రధాన నేతలంతా ఓటమి దారిలో ఉన్నారు. ప్రస్తుతం, 70 అసెంబ్లీ సీట్లకు గానూ బీజేపీ 48, ఆప్ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
ఢిల్లీలోని 70 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతోంది. నేడు తుది ఫలితాలు వెలువడనున్నాయి. ఢిల్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చింది. కస్తూర్బా నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి నీరజ్ బసోయా విజయం సాధించారు. ఇప్పటివరకు బీజేపీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాగా లక్ష్మీనగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి అభయ్ వర్మ విజయ దుందుబీ మోగించారు..ఆప్ అభ్యర్థి కుల్దీప్ కుమార్ కొండ్లి స్థానం నుంచి విజయం సాధించారు.
Delhi Election Results: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం ఇంటర్నెట్లో మీమ్స్‌కి కారణమైంది. ఫన్నీ మీమ్స్‌తో నెటిజన్లు రచ్చ చేస్తున్నారు. ముఖ్యంగా ఆప్, కాంగ్రెస్ పరిస్థితిపై మీమ్స్ వైరల్ అవుతున్నాయి. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, ఢిల్లీలోని మొత్తం 70 అసెంబ్లీ స్థానాలకు గానూ బీజేపీ 46, ఆప్ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. దీంతో ఇంటర్నెట్ యూజర్లు అరవింద్ కేజ్రీవాల్, రాహుల్ గాంధీని ఉద్దేశిస్తూ మీమ్స్ వైరల్ చేస్తున్నారు.
ఢిల్లీ ఎన్నికల్లో తొలి ఫలితం వచ్చింది. కస్తూర్బా నగర్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థి నీరజ్ బసోయా విజయం సాధించారు. ఇప్పటివరకు బీజేపీ 46 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఆప్ 24 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.
AAP: ఢిల్లీ ఎన్నికల్లో బీజేపీ అఖండ విజయం దిశగా దూసుకుపోతోంది. ఆప్ అధినేత కేజ్రీవాల్, ఢిల్లీ సీఎం అతిశీ మార్లేనా వంటి వారితో పాటు ఆ పార్టీకి చెందిన సౌరభ్ భరద్వాజ్, సోమ్‌నాథ్ భారత, సత్యేందర్ జైన్ వంటి వారు వెనకంజలో ఉన్నారు. పదేళ్ల పాటు ఢిల్లీని పాలించిన ఆప్‌కి ఈ ఫలితాలు రుచించడం లేదు.