ఢిల్లీ బీజేపీ కేంద్ర కార్యాలయం దగ్గర ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు ఆందోళనకు దిగారు. దిన్ దయాళ్ ఉపాద్యాయ మార్గ్‌లో ఉన్న కార్యాలయం ఎదుట ఆప్ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను వెంటనే జైలు నుంచి విడుదల చేయాలని డిమాండ్ చేశారు
ఛండీఘర్ మేయర్ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమి పాలైంది. దీంతో ఆప్ పార్టీ ఆందోళనలకు పిలుపునిచ్చింది. మేయర్ ఎన్నికల్లో బీజేపీ మోసం చేసి విజయం సాధించిందని కేజ్రీవాల్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఢిల్లీ మేయర్ పీఠం కోసం మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో భారీ గందరగోళం చెలరేగింది. ఈరోజు ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ఎన్నిక విషయంలో రెండు వర్గాల మధ్య రసాభాస జరిగింది. సీక్రెట్ బ్యాలెట్ ద్వారా మేయర్ ఎన్నిక జరగాల్సి ఉంది.