విశాఖపట్నం మధురవాడలోని శ్రీ తనుష్ పాఠశాలలో అమానుష ఘటన చోటుచేసుకుంది... సదరు పాఠశాలలో 8వ తరగతి చదువుతోన్న విద్యార్థి చేయి విరగొట్టాడు ఉపాధ్యాయుడు.. ఇనుప బల్ల కేసి చితకబాది.. ఆపై పిడుగులు గుద్ధి చేయి విరగగొట్టాడు అని విద్యార్థి తల్లితండ్రులు చెబుతున్నారు.. ఈ ఘటనలో మూడు చోట్ల బాలుడి ఎముకలు విరిగాయి.. దీంతో, శస్త్ర చికిత్స కోసం విద్యార్థిని మెడికవర్ ఆసుపత్రికి తరలించారు.. విద్యార్థిపై దాడికి కారణమైన సోషల్ మాస్టర్ మోహన్.. ప్రస్తుతం పరారీలో ఉన్నాడు..