న్యాచురల్ స్టార్ నాని, నజ్రియా ఫహద్ జంటగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘అంటే సుందరానికీ’. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ తో నాని మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. కరోనా కారణంగా పెద్ద సినిమాలు వాయిదా పడడం, ఆ తరువాత కొత్త రిలీజ్ డేట్లు ప్రకటించడం.. ఇంకొన్ని పెద్ద…