పదో తరగతి పరీక్ష ఫలితాలలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థిని సత్తా చాటింది. విద్యార్థిని పావని చంద్రిక కారంపూడి మండలం ఒప్పిచర్ల ప్రభుత్వ పాఠశాలలో చదివి 598 మార్కులు సాధించింది. విద్యార్థిని పావని చంద్రికని జిల్లా విద్యాశాఖ అధికారులు అభినందించారు. నరసరావుపేటలోని జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి విద్యార్థిని పావని చంద్రిక, ఆమె తల్లిదండ్రులు, పాఠశాల HM లను పిలిచి సన్మానించి స్వీట్లు తినిపించారు జిల్లా డీఈఓ చంద్రకళ. Also Read:CM Chandrababu: వీరయ్య చౌదరి మృతదేహానికి చంద్రబాబు నివాళులు…
పదో తరగతి ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్. టెన్త్ లో చూపిన ప్రతిభ పై చదువులకు బాటలు వేసి గోల్డెన్ ఫ్యూచర్ ను అందిస్తుంది. అందుకే తల్లిదండ్రులు.. ఉపాధ్యాయులు టెన్త్ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో పలువురు విద్యార్థులు సత్తాచాటారు. ఏకంగా 600కు 600 మార్కులు సాధించి ఔరా అనిపించారు. ఈ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలకు…