పదో తరగతి ప్రతి విద్యార్థి భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్. టెన్త్ లో చూపిన ప్రతిభ పై చదువులకు బాటలు వేసి గోల్డెన్ ఫ్యూచర్ ను అందిస్తుంది. అందుకే తల్లిదండ్రులు.. ఉపాధ్యాయులు టెన్త్ విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. ఆంధ్రప్రదేశ్ లో ఇటీవల జరిగిన పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ఫలితాలు నేడు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో పలువురు విద్యార్థులు సత్తాచాటారు. ఏకంగా 600కు 600 మార్కులు సాధించి ఔరా అనిపించారు. ఈ ఫలితాల్లో ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్ధిని మెరిసింది. ఏకంగా 598 మార్కులు సాధించి ఆదర్శంగా నిలిచింది.
Also Read:Pawan Kalyan: తన సినిమాల నిర్మాతలతో పవన్ కీలక సమావేశం
పల్నాడు ఒప్పిచర్ల జడ్పీ స్కూల్ విద్యార్థిని పావని చంద్రిక 600కు 598 మార్కులు సాధించి అదరగొట్టింది. ఆ రెండు మార్కులు ఎందులో తగ్గాయంటే హిందీ, ఇంగ్లీష్ లో. ఈ రెండు సబ్జెక్ట్స్ లో 99 మార్కుల చొప్పున వచ్చాయి. 598 మార్కులు సాధించిన పావని చంద్రికపై ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తల్లిదండ్రులు పట్టరాని ఆనందంతో మురిసిపోతున్నారు. ఇక అన్నమయ్య పెద్దవీడు, ప్రకాశం ఆలకూరపాడు జెడ్పీ స్కూల్స్ విద్యార్థినులు మేఘ, వెంకట భార్గవికి 595 మార్కులు వచ్చాయి. కార్పోరేట్ స్కూల్స్ కు ధీటుగా రికార్డ్ మార్కులు సాధించిన విద్యార్థులపై అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read:Pahalgam Terror Attack: కరాచీ, ముజఫరాబాద్‌లో ఉగ్రవాద హ్యాండర్లు.. పాక్ ప్రమేయంపై సంచలన ఆధారాలు..
టెన్త్ ఫలితాల్లో కాకినాడకు చెందిన నేహాంజని అనే స్టూడెంట్ ఏకంగా 600 మార్కులకు గానూ 600 స్కోర్ సాధించింది. రాష్ట్ర చరిత్రలో 100 శాతం మార్కులు సాధించిన తొలి విద్యార్థినిగా ఈ విద్యార్థి నయా రికార్డ్ సృష్టించింది. అయితే ల్యాంగ్వేజ్ పేపర్లలో సైతం 100కు వంద మార్కులు రావడం, మొత్తానికి వంద శాతం మార్కులు సాధించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. నేహంజలి 600కి 600 మార్కులు తెచ్చుకోవడంతో సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.