Aatma Bandhuvu: సారథి సంస్థ భాగ్యనగరంలో ‘శ్రీసారథి స్టూడియోస్’ నిర్మించి, అనేక మహత్తరమైన చిత్రాలను తెరకెక్కించింది. అందులో మహానటుడు యన్.టి.రామారావుతో ఈ సంస్థ రెండు సూపర్ హిట్స్ నిర్మించడం, అవి రెండూ శివాజీగణేశన్ తమిళ చిత్రాలకు రీమేక్ కావడం విశేషం! వాటిలో మొదటిది ‘కలసివుంటే కలదుసుఖం’ కాగా, రెండవది ‘ఆత్మబంధువు’. ఈ రెండు చిత్రాలలోనూ సావిత్రి నాయికగా నటించడం మరో విశేషం! ‘కలసివుంటే కలదు సుఖం’కు తమిళ ఒరిజినల్ ‘భాగ పిరివినై’, ‘ఆత్మబంధువు’కు ‘పడిక్కాద మేధై’ మాతృక.…