అమెరికా టెక్సాస్ రాష్ట్రంలో ఘోరం జరిగింది. అమెరికాకు కంటైనర్ ట్రక్ లో వలస వస్తున్న వారు కంటైనర్ లోనే మరణించారు. ఊపిరి ఆడకపోవడం, విపరీతమైన వేడి కారణంగా అందులోనే చనిపోయారు. ఈ ఘటనలో మరణాల సంఖ్య 51కి చేరింది. టెక్సాస్ లోని శాన్ ఆంటోనియోలో మంగళవారం రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్రక్ కంటైనర్ లో పెద్ద సంఖ్యలో శవాలను కనుక్కున్నారు. మరణించిన వారిలో 39 మంది పురుషులు ఉండగా..12 మంది మహిళలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.…