(ఫిబ్రవరి 17న ‘రైతు కుటుంబం’కు 50 ఏళ్ళు)నటసమ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు హీరోగా పలు రైతు నేపథ్యగాథలు తెరకెక్కాయి. వాటిలో అనేకం విజయపథంలో పయనించాయి. ఏయన్నార్ నటించిన ‘రైతు కుటుంబం’ సైతం జనాన్ని విశేషంగా అలరించింది. 1972 ఫిబ్రవరి 17న ‘రైతుకుటుంబం’ విడుదలైంది. ‘రైతు కుటుంబం’ టైటిల్ లోనే కథ తెలిసిపోతోంది. ఓ రైతు పెద్ద కొడుకు జోగయ్య ఇల్లు పట్టించుకోకుండా పేకాట ఆడుతూ జల్సాగా తిరుగుతూ ఉంటాడు. జోగయ్య భార్య అన్నపూర్ణ తన కూతురుతో పాటు మరదులు…