టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దాదాపు 99 శాతం సక్సెస్ రేటును కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకూ జక్కన్నకు అపజయమే ఎదురవ్వలేదు అన్నది జగమెరిగిన సత్యం. ప్రస్తుత భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎందరో లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నప్పటి ఒక్క జక్కన్నకు తప్ప మరే ఇతర చిత్రనిర్మాతకి ఈ రికార్డు లేదు. ఈ డైరెక్టర్ ఇప్పుడు “ప్రపంచంలో 50 కూలెస్ట్ ఫిల్మ్ మేకర్స్”లో స్థానం సంపాదించాడు. వాస్తవానికి ఈ జాబితాలో ఉన్న ఏకైక భారతీయ దర్శకుడు రాజమౌళి…