టాలీవుడ్ దర్శక దిగ్గజం ఎస్ఎస్ రాజమౌళి దాదాపు 99 శాతం సక్సెస్ రేటును కలిగి ఉన్నాడు. ఇప్పటి వరకూ జక్కన్నకు అపజయమే ఎదురవ్వలేదు అన్నది జగమెరిగిన సత్యం. ప్రస్తుత భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఎందరో లెజెండరీ డైరెక్టర్స్ ఉన్నప్పటి ఒక్క జక్కన్నకు తప్ప మరే ఇతర చిత్రనిర్మాతకి ఈ రికార్డు లేదు. ఈ డైరెక్టర్ ఇప్పుడు “ప్రపంచంలో 50 కూలెస్ట్ ఫిల్మ్ మేకర్స్”లో స్థానం సంపాదించాడు. వాస్తవానికి ఈ జాబితాలో ఉన్న ఏకైక భారతీయ దర్శకుడు రాజమౌళి మాత్రమే కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న 50 మంది చిత్రనిర్మాతలలో రాజమౌళి 25వ స్థానంలో ఉన్నాడు. ఆస్కార్ విన్నింగ్ ‘పారాసైట్’ మూవీని రూపొందించిన కొరియన్ దర్శకుడు బాంగ్ జూన్-హో ఈ జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు.
Read Also : “శ్యామ్ సింగ రాయ్” సస్పెన్స్ కు తెర దించిన దర్శకుడు
రాజమౌళి బాహుబలి, మగధీర, ఈగ వంటి చిత్రాలను, భాష ఏదైనా బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టే కంటెంట్ తో రూపొందించి టాలీవుడ్ కు అంతర్జాతీయ స్థాయిలో కీర్తి దక్కడానికి మార్గం సుగమం చేసారు. ఈరోజు రాజమౌళిని టాప్ 50 మంది చిత్రనిర్మాతలలో చూడడం భారతదేశం గర్విస్తోంచదగ్గ విషయం. కాగా ప్రస్తుతం రాజమౌళి “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 7న విడుదలకు సిద్ధంగా ఉంది.