ఓవైపు కొత్త సంస్థలు వస్తున్నాయి, కొత్త ఉద్యోగాలను సృష్టిస్తున్నామని చెబుతున్నారు.. మరోవైపు లక్షల్లో సంస్థలు మూతపడుతున్నాయి.. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే స్వయంగా ప్రకటించింది.. దాదాపు ఆరేళ్లలో భారత దేశవ్యాప్తంగా 5 లక్షలకుపైగా సంస్థలు మూతపడినట్టు కేంద్రం వెల్లడించింది.. 2016 ఏప్రిల్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు మొత్తం 5,00,506 కంపెనీలు మూతపడినట్టు లోక్‌సభలో కార్పొరేట్ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి రావు ఇంద్రజిత్ సింగ్.. లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. నోట్ల రద్దు, జీఎస్టీ, కరోనా…