తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుమంగళం సమీపంలోని శివరకోట్టై వద్ద విరుదునగర్-మదురై హైవేపై ప్రమాదం జరిగింది. ఈరోజు ఉదయం జరిగిన ప్రమాదంలో వేగంగా వస్తున్న కారు.. బైకును తప్పించబోయి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ఉన్న నలుగురు, బైకిస్ట్ అక్కడికక్కడే మృతి చెందారు. ఈ ఘటనతో రహదారి మొత్తం రక్తసిక్తమైంది.