ఇండియాను మంకీపాక్స్ కేసులు కలవరానికి గురి చేస్తున్నాయి. ఇప్పటికే మూడు కేసులు నమోదు కాగా.. తాజాగా నాలుగో కేసు నమోదు అయింది. శనివారం వరకు నమోదు అయిన మంకీపాక్స్ కేసులు కేరళ రాష్ట్రంలో వెలుగు చూడగా.. నాలుగో కేసు దేశ రాజధాని ఢిల్లీలో బయటపడింది. దీంతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య నాలుగుకు చేరింది. కేరళలో నమోదు అయిన మూడు కేసుల్లో బాధితులు ఇటీవల గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు వచ్చారు.