(జూన్ 24తో ‘ఊరికిచ్చిన మాట’ 40 ఏళ్ళు పూర్తి)నలభై ఏళ్ళ క్రితం చిరంజీవి ఇంకా వర్ధమాన కథానాయకునిగా రాణిస్తున్న రోజుల్లో నటునిగా ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టిన చిత్రం ‘ఊరికిచ్చిన మాట’. ప్రముఖ నటుడు యమ్.బాలయ్య సమర్పణలో అమృతా ఫిలిమ్స్ పతాకంపై ఆయన దర్శకత్వంలోనే తెరకెక్కిన చిత్రమిది. 1981 జూన్ 24న విడుదలైన ఈ చిత్రంలో చిరంజీవి, సుధాకర్ అన్నదమ్ములుగా నటించారు. ‘ఊరికిచ్చిన మాట’ కథ విషయానికి వస్తే – ఓ మారుమూల పల్లెటూల్లో ఇద్దరు…