(డిసెంబర్ 24న ‘కిరాయి రౌడీలు’కు 40 ఏళ్ళు)మెగాస్టార్ చిరంజీవి, డైలాగ్ కింగ్ మోహన్ బాబు హీరోలుగా నటించిన ‘కిరాయి రౌడీలు’ చిత్రం డిసెంబర్ 24తో 40 ఏళ్ళు పూర్తి చేసుకుంటోంది. శ్రీక్రాంతి చిత్ర పతాకంపై ఎ.కోదండరామిరెడ్డి దర్శకత్వంలో టి.క్రాంతికుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఇందులో చిరంజీవికి జోడీగా రాధిక నటించారు. 1981 డిసెంబర్ 24న ‘కిరాయిరౌడీలు’ విడుదలయింది. అంతకు ముందు అదే సంవత్సరంలో క్రాంతికుమార్ నిర్మించిన ‘న్యాయం కావాలి’లో చిరంజీవి, కోదండరామిరెడ్డి తొలిసారి కలసి పనిచేశారు. వారిద్దరి…