చిత్రసీమ అంటేనే చిత్ర విచిత్రాలకు నెలవు. ఒకే కథ అటూ ఇటూ తిరిగి, మళ్ళీ మనముందు వాలుతూ ఉంటుంది. ప్రేక్షకులు సైతం తెలిసిన కథనే చూసి ఆనందించిన సందర్భాలున్నాయి. 1953లో రేలంగి, అంజలీదేవి జంటగా సి.పుల్లయ్య దర్శకత్వంలో తెరకెక్కిన ‘పక్కయింటి అమ్మాయి’ చిత్రం ఆ రోజుల్లో మంచి వినోదం పంచి విజయం సాధించింది. దాదాపు 28 సంవత్సరాల తరువాత అదే కథ ‘పక్కింటి అమ్మాయి’గా పునర్నిర్మితమై అలరించింది. అసలు ఈ కథ బెంగాల్ నుండి దిగుమతి చేసుకున్నది.…