ఒకప్పుడు హిందీ రీమేక్స్ కు తెలుగులో విపరీతమైన క్రేజ్ తీసుకు వచ్చిన ఘనత నిస్సందేహంగా నటరత్న నందమూరి తారక రామారావుదే! ఆయన నటించిన “నిప్పులాంటి మనిషి, అన్నదమ్ముల అనుబంధం, ఆరాధన, నేరం నాది కాదు ఆకలిది” వంటి హిందీ రీమేక్స్ బాక్సాఫీస్ బరిలో జయకేతనం ఎగురవేశాయి. వాటి సరసన చేరిన చిత్రం యన్టీఆర్ నిర్మించి, నటించిన ‘అనురాగదేవత’. హిందీలో ఘనవిజయం సాధించిన ‘ఆషా’ ఆధారంగా ‘అనురాగదేవత’ రూపొందింది. 1982 జనవరి 9న సంక్రాంతి కానుకగా ‘అనురాగదేవత’ జనం…
తెలుగు చిత్రసీమలో బాపు తీతకు, ముళ్ళపూడి వెంకటరమణ రాతకు విశేషస్థానముంది. వారి జోడీ సాంఘికం తీసినా, పౌరాణికం తెరకెక్కించినా, రీమేక్స్ అందించినా జనం అభిమానించారు, ఆదరించారు. స్ట్రెయిట్ మూవీస్ తోనే కాదు, పరభాషల్లో విజయం సాధించిన చిత్రాలకు తెలుగుదనం అద్ది అందించడంలోనూ బాపు-రమణ తమదైన బాణీ పలికించారు. అలా వారి అద్దకంలో వెలుగు చూసిన చిత్రాల్లో ‘రాధా కళ్యాణం’ ఒకటి. తమిళంలో భాగ్యరాజా స్వీయదర్శకత్వంలో నటించిన ‘అంద 7 నాట్కల్’ చిత్రం ఆధారంగా ఈ ‘రాధా కళ్యాణం’…
కొన్ని సినిమాల బాక్సాఫీస్ రిజల్ట్ ఎలా ఉన్నా, ఆ టైటిల్స్ సదరు చిత్రాల హీరోల ఇమేజ్ ను పెంచుతూ ఉంటాయి. నటరత్న యన్.టి. రామారావు సినిమాలలో అలాంటివి చాలా టైటిల్స్ ఉన్నాయనే చెప్పాలి. జనం మదిలో ‘యుగపురుషుడు, మహాపురుషుడు’ అన్న రీతిలో నిలచిపోయారు యన్టీఆర్. ఆ రెండు టైటిల్స్ తో రూపొందిన చిత్రాలలో యన్టీఆర్ నటించి అలరించారు. ఆయన హీరోగా తెరకెక్కిన ‘మహాపురుషుడు’ చిత్రం 1981 నవంబర్ 21న జనం ముందు నిలచింది. ‘మహాపురుషుడు’ కథ విషయానికి…