ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత అరవింద్ కేజ్రీవాల్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మహిళా ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో పడ్డారు. 'ముఖ్యమంత్రి మహిళా సమ్మాన్ యోజన' అమలును ఇటీవలే ప్రకటించిన అరవింద్ కేజ్రీవాల్.. ఒక సర్వేను ఉటంకిస్తూ, ఢిల్లీలోని 60 శాతం మంది మహిళలు తనకు ఓటు వేయబోతున్నారని, 40 శాతం మంది తనకు అనుకూలంగా లేరని అన్నారు.