కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ వరుసగా మూడోసారి గెలిచారు. నాగ్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆయన.. తన సమీప కాంగ్రెస్ ప్రత్యర్థిపై 1,37, 603 ఓట్ల తేడాతో విజయం సాధించారు. కాగా.. కాంగ్రెస్ అభ్యర్థి వికాస్ ఠాక్రేకు 5,17,424 ఓట్లు రాగా, నితిన్ గడ్కరీకి 6,55,027 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి యోగేశ్ లంజేవార్ 19,242 ఓట్లతో మూడో స్థానంలో నిలవగా.. నోటాకు 5,474 ఓట్లు వచ్చాయి.