ఆ రోజుల్లో సుప్రీమ్ హీరో చిరంజీవి, ఎ.కోదండరామిరెడ్డి కాంబో అంటే జనానికి ఎంతో క్రేజ్. అప్పటికే వీరిద్దరి కలయికలో రూపొందిన అనేక చిత్రాలు బాక్సాఫీస్ ను భమ్ చిక భమ్ ఆడించాయి. అలా చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబోలో రూపొందిన ‘దొంగమొగుడు’ చిత్రం 1987 జనవరి 9న విడుదలై విజయపథంలో పయనించింది. చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబోలో అప్పటికే పలు నవలా చిత్రాలు సక్సెస్ సాధించాయి. ఈ నేపథ్యంలోనే యండమూరి వీరేంద్రనాథ్ రాసిన ‘నల్లంచు తెల్లచీర’ నవలకు మరింత కథ…