(ఏప్రిల్ 9తో ‘కలెక్టర్ గారి అబ్బాయి’కి 35 ఏళ్ళు) మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు, ఆయన నటవారసుడు నాగార్జున కలసి నటించిన చిత్రాలలో తొలి సూపర్ హిట్ గా నిలచిన చిత్రం ‘కలెక్టర్ గారి అబ్బాయి’. బి.గోపాల్ దర్శకత్వంలో ఏయన్నార్ పెద్ద అల్లుడు యార్లగడ్డ సురేంద్ర నిర్మించిన ‘కలెక్టర్ గారి అబ్బాయి’ 1987 ఏప్రిల్ 9న విడుదలయి, విజయఢంకా మోగించింది. ‘కలెక్టర్ గారి అబ్బాయి’ కథ ఏమిటంటే – రమాకాంతరావు అనే కలెక్టర్ నీతి, నిజాయితీలే ప్రాణంగా జీవిస్తూ…