317 జీవో కారణంగా మహబూబాద్ జిల్లా నెల్లికుదురు మండలం సంధ్యా తండాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు జేతి రామ్ కుటుంబ సభ్యులను టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలో రాక్షస పాలన కొనసాగుతుందన్నారు. రాష్టంలో నిరంకుశ పాలన కొనసాగుతుందని ఎద్దేవా చేశారు. జెత్రం నాయక్ మరణానికి కారణం ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవో అన్నారు.
Read Also: తెలంగాణ వచ్చినా.. నిరుద్యోగులు, రైతుల ఆత్మహత్యలు ఆగలేదు: వీహెచ్
జెత్రం నాయక్ అంత్యక్రియలు కూడా పోలీస్ పహారా మధ్య కుటుంబ సభ్యులు కడసారి చూపుకు కూడా నోచుకోలేదని మండిపడ్డారు. ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే ప్రభుత్వం తరపున కనీసం పరామర్శ కూడా లేదన్నారు. రాష్ట్రంలో మానవత్వం లేని రాక్షస పాలన సాగుతుందన్నారు. 317 జీవోలోని తప్పులను ఖచ్చితంగా పార్లమెంట్‌లో మాట్లాడుతానని రేవంత్ రెడ్డి అన్నారు.టీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన 317 జీవో కారణంగా ప్రభుత్వ ఉద్యోగులకు స్థానికత ను కోల్పోయేటట్లు చేస్తుందని విమర్శించారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం 317జీవోను రద్దు చేసే అవకాశం ఉన్న రాజకీయ లబ్ధి కోసం ఆరాటపడుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ జెత్రం కుటుంబానికి అండగా ఉంటుందని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.