కరోనా టైమ్ లో ఖాళీగా ఇంట్లో కూర్చున్నవాళ్ళను విశేషంగా ఆకట్టుకుంది గర్ల్ ఫార్ములా సీరిస్ లో చాయ్ బిస్కెట్ సంస్థ నిర్మించిన ’30 వెడ్స్ 21′ వెబ్ సీరిస్. తొలి సీజన్ ఎపిసోడ్స్ అన్నింటినీ కలిపి ఒకటిగా యూ ట్యూబ్ లో టెలికాస్ట్ చేసిందీ సంస్థ. పదేళ్ళ గ్యాప్ ఉన్న ఓ అబ్బాయి, ఓ అమ్మాయి సంసారం జీవితంలోకి అడుగుపెట్టిన తరుణంలో వారి మనోభావాలు ఎలా ఉంటాయనే అంశాన్ని తీసుకుని దర్శకుడు పృథ్వీ వనం ఆ వెబ్…