హిందువులు ఎంతో పవిత్రంగా భావించే అమర్ నాథ్ యాత్ర మరికొద్ది రోజుల్లో ప్రారంభం కాబోతోంది. మంచురూపంలో ఉన్న శివలింగాన్ని దర్శించుకునేందుకు దేశ నలుమూలల నుంచి భక్తులు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు చేసుకున్నారు. ఏకంగా ఇప్పటి వరకు సుమారుగా 3 లక్షల మంది వరకు రిజిస్ట్రేషన్లు చేసుకున్నట్లు శ్రీ అమర్ నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు( ఎస్ఏఎస్బీ) వెల్లడించింది. 43 రోజుల యాత్ర కోసం యాత్రికుల నమోదును ఏప్రిల్ 11న ప్రారంభించారు. దేశవ్యాప్తంగా వివిధ బ్యాంకులకు చెందిన 566…