మాదకద్రవ్యాల అక్రమ రవాణాపై అమెరికా దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. సముద్రం ద్వారా దేశంలోకి ప్రవేశించే డ్రగ్స్‌పై అమెరికా వేట సాగిస్తోంది. తాజా దాడిలో ముగ్గురు చనిపోయినట్లు ట్రంప్ ప్రకటించారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. వీడియోలో వేగంగా దూసుకుపోతున్న బోటుపై ఒక్కసారిగా బాంబ్ దాడి జరగడంతో ధ్వంసమైంది.
అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. టెక్సాస్‌లోని ఆస్టిన్ టార్గెట్ పార్కింగ్ స్థలంలో ఒక దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. ఈ కాల్పుల్లో ముగ్గురు మృతిచెందారు. పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.
అనంతపురం జిల్లా తాడిపత్రి మండలం వంగనూరు సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కడప నుండి వెళ్తున్న కారును లారీ ఢీ కొట్టడంతో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు.. మృతులు ప్రతాప్ రెడ్డి ( 22), ప్రమీల(21) ఘటనా స్థలంలోనే కన్నుమూయగా.. వెంకటమ్మను ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు విడిచింది.
అగ్ర రాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులతో దద్దరిల్లింది. ఓ నైట్‌క్లబ్ దగ్గర దుండగుడు జరిపిన కాల్పుల్లో ముగ్గురు మరణించగా.. మరో 13 మంది గాయపడ్డారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత చర్చి స్ట్రీట్‌లో ఉన్న నైట్‌క్లబ్ దగ్గర కాల్పులు జరిగాయి.
గుజరాత్‌లో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాష్ట్రంలోని ఆరావళి జిల్లాలో రెండు బస్సులు భారీ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. మరో 30 మందికి గాయాలయ్యాయి. దీంతో బస్సులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. మల్పూర్ నుండి వస్తున్న గుజరాత్ స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ బస్సు డివైడర్‌ను దాటి మోదసా నుండి మల్పూర్‌కు వెళ్తున్న మరో బస్సును ఢీకొట్టింది. కాగా.. ప్రమాద ఘటనకు సంబంధించి సమీపంలోని ఓ ఇంటి…