దేశవ్యాప్తంగా మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేఖంగా ఢిల్లీలో ఏడాది పాటు రైతులు ఉద్యమం చేశారు. చివరకు రైతులు ఉద్యమానికి దిగివచ్చి ప్రధాని నరేంద్రమోదీ వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ఇదిలా ఉంటే రైతుల ఉద్యమంలో భాగంగా యూపీలో లఖీంపూర్ ఖేరీలో జరిగిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించింది. కేంద్రమంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా రైతులపైకి వేగంగా కార్లు నడిపించడంతో 8…