ఏ తండ్రికైనా గారాలపట్టి కూతురే అనడంలో సందేహం లేదు. కుమార్తెను మహాలక్ష్మీలా చూసుకుంటూ.. కంటికి రెప్పలా కాపాడుకుంటూ మురిసిపోతుంటారు. కూతురి భవిష్యత్తు కోసం ఎంత కష్టమైన భరిస్తుంటారు. ఇదే రీతిలో ఓ తండ్రి తన బిడ్డపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. కూతురికి తరాలు మారినా చెరిగిపోని గిఫ్ట్ ఇచ్చి ఆశ్చర్యపరిచాడు. ఏకంగా 3 కిలోల వెండితో రూ. 25 లక్షల విలువైన వెడ్డింగ్ కార్డును తయారు చేసి బహుమతిగా ఇచ్చాడు. రాజస్థాన్ తరచుగా రాజ వివాహాలకు ప్రసిద్ధి…