Auto Driver: కేరళలోని ఓ ఆటోడ్రైవర్ నక్క తోకను తొక్కాడు. అదృష్ట దేవత అతడిని లాటరీ రూపంలో కరుణించింది. దీంతో రాత్రికి రాత్రే కోటీశ్వరుడిగా మారిపోయాడు. వివరాల్లోకి వెళ్తే.. కేరళలో ఓనం పండగ సందర్భంగా తిరువోణం బంపర్ లాటరీని నిర్వహించారు. ఈ లాటరీలో తిరువనంతపురంలోని 32 ఏళ్ల ఆటోరిక్షా డ్రైవర్ అనూప్ రూ.25 కోట్ల మెగా బహుమతిని సొంతం చేసుకున్నాడు. ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు లాటరీ బహుమతుల విజేతలను నిర్వాహకులు ప్రకటించారు. ఈ సందర్భంగా టికెట్…